బహిరంగ ప్రకటన చేసేటప్పుడు నేతలు సమన్వయంతో వ్యవహరించాలని అనవసర వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాని మోదీ సూచించినట్లు తెలిసింది. 

బాజేపాలో కొందరు నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దొమారం రేపిన సంగతి తెలిసిందే. ఇటువంటి వాటిపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

 బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు నేతలు సమన్వయంతో వ్యవహరించాలని అనవసర వ్యాఖ్యలు చేయొద్దని సూచించినట్లు తెలిసింది. 

ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సూచనలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్ పర్యానకు చెందిన భాజపా నేతలు ఇటీవల చేసిన వాక్యాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. 

ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన మీడియాకు వివరాలను వెల్లడించిన కర్నూల్ కరేశిని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్ మంత్రి విజయశా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీనిపై హైకోర్టు ఆదేశాలు మేరకు ఆయనపై కేసు నమోదు అయింది. అనంతరం ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లగా సర్వోన్నత న్యాయస్థానం కూడా మంత్రిపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. 

ఇది మరవక ముందే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవుడా కూడా సైన్యాన్ని కించపరుస్తూ వాక్యాలు చేశారు. 

తాజాగా హర్యానాకు చెందిన భాజపా రాజ్యసభ ఎంపీ రాంచందర్  జాంగ్రా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పహాగ్రామ్ లో భర్తలను కోల్పోయిన మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వాక్యాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

 ఆ మహిళకు ధైర్యం పోరాట స్ఫూర్తి ఉంటే మరణాల సంఖ్య చాలా తక్కువ ఉండేది అన్నారు. ఇలా భాజపా నేతలు చేసిన వాక్యాల నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ. వివాదాస్పద వ్యాఖ్యలు ధోరణికి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది.